Spread the love

జగన్ రెడ్డి ప్రజలకు..రాష్ట్రానికి చేసిన తీవ్రనష్టాన్ని భర్తీచేయడానికి, సంక్షేమం.. అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగించడానికి పడుతున్న కష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి : పుల్లారావు

కూటమి పార్టీల మండల..గ్రామ నాయకులు, బూత్.. యూనిట్.. క్లస్టర్ ఇన్ ఛార్జ్ లకు ప్రత్తిపాటి దిశానిర్దేశం.

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో నూటికి నూరుశాతం పోలింగ్ జరగాలని, ఎక్కడ ఓట్లు తగ్గినా, సక్రమంగా పోలింగ్ జరగకపోయినా స్థానిక ఎన్నికల సిబ్బంది.. నాయకులే భాధ్యులవుతారని, పనిచేసేవారికే కూటమిపార్టీల్లో గుర్తింపు ఉంటుందని, అందుకు నాతో సహా ఎవరూ అతీతులు కారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో వున్న సచివాలయం ఉద్యోగులను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మద్దతు తెలపాలి అని కోరటం జరిగింది. కేళ్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ చుండి రంగనాయకుల కళాశాల లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మాట్లాడటం జరిగింది. అనంతరం యడ్లపాడు కూటమి సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ జగన్ ఏవిధంగా రాష్ట్రాన్ని, వ్యవస్థలను భ్రష్టుపట్టించాడు.. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా, ప్రజలకు సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు ఏవిధంగా కష్టపడుతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా స్థానిక నాయకులపైనే ఉందన్నారు. కూటమిప్రభుత్వ 8నెలల పనితీరుకు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తార్కాణంగా నిలవనున్నాయనే వాస్తవాన్ని గుర్తుంచుకొని అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. నాదెండ్ల మండలం, యడ్లపాడు మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించిన ఆయన విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, గ్రామ..మండల నాయకులు, బూత్..క్లస్టర్.. యూనిట్ ఇన్ ఛార్జులతో వరుస సమావేశాలు నిర్వహించారు.


నమూనా బ్యాలెట్ లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు ముందే ఉంటుందని, ఆయన పేరుపై నిలువుగీత గీస్తే అది తొలిప్రాధాన్యతా ఓటుగా పరిగణించబడుతుందని పుల్లారావు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 8,700 పైచిలుకు ఓట్లున్నాయని ఒక్క ఓటు కూడా చేజారడానికి వీల్లేదన్నారు. ఓట్లు తక్కువగా ఉన్నా.. పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గంలో 8 నెలల్లో జరిగిన, భవిష్యత్ లో జరగబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేయాలని, యడ్లపాడు మండలంలో కొన్నిరోడ్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. చౌడవరం నుంచి నేరుగా జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నిర్మించే రోడ్డు నిర్మాణం కూడా పూర్తిచేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే క్రమపద్ధతిలో దేవాదాయ, మార్కెట్, సొసైటీ పాలకమండళ్ల నియామకాలు పూర్తిచేస్తామని ప్రత్తిపాటి తెలిపారు. అదేవిధంగా గతంలో వివిధ పనులు చేసి బిల్లులు రాక నష్టపోయిన వారిని కూడా ఆదుకుంటామని మాజీమంత్రి స్పష్టంచేశారు. కచ్చితంగా పదేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, మూడుపార్టీల నాయకులు ఎవరూ నష్టపోవడానికి వీల్లేదన్నారు. రాజకీయాల్లో సమయం వచ్చినప్పుడు పనిచేసి తమను తాము నిరూపించుకోవాలని, తరువాత పదవులు వాటికవే వెతుక్కుంటూ వస్తాయని పుల్లారావు పేర్కొన్నారు. మిర్చి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్న ప్రత్తిపాటి, త్వరలోనే ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త అందుతుందన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన పేదల ఇళ్ల నిర్మాణం కూడా చాలావరకు పూర్తయిందన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన ఇన్చార్జి తోట రాజా రమేష్, టిడిపి, జనసేనా, బీజేపీ నాయకులు తదితులున్నారు.