TEJA NEWS

జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నిక సందర్భంగా విచ్చేసిన టి జి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు.

రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారము జగిత్యాల జిల్లా కార్యవర్గ ఎన్నికలు తూము రవీందర్ ఎన్నికల అధికారి మరియు గంగుల సంతోష్ కుమార్ మాజీ టీజీవో జగిత్యాల అధ్యక్షులు అధ్యక్షులు సమక్షంలో స్థానిక విశ్వకర్మ భవన్ ఫంక్షన్ హాలులో కార్యవర్గాన్ని అంతటిని ఏకగ్రీవంగా సమిష్టి నిర్ణయంతో ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్షులుగా కందుకూరి రవిబాబు ప్రధాన కార్యదర్శిగా మామిడి రమేష్ అసోసియేటెడ్ అధ్యక్షులుగా అరిగెల అశోక్ కోశాధికారిగా గణేష్ లతోపాటు మొత్తం 20 మందితో కార్యవర్గం ఏర్పాటు చేయడం అయినది కార్యవర్గం యొక్క

ప్రొసీడింగ్స్ జతపరచని అయినది

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు మరియు రాష్ట్ర నాయకులు శ్యామ్ ఉపేందర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి శిరీష శిరీష హాజరైనారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీవో సంఘం ఏర్పడిన నుండి ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నామని ఉద్యోగులకు రావలసిన అన్ని సదుపాయాలు రావాలని మరియు పెండింగ్లో ఉన్న బిల్లులు మెడికల్ బిల్లులు పదవి విరమణ పొందిన వారి పెన్షన్ బిల్లులు అన్నీ కూడా సత్వరమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడమైనదని ఇదే అంశాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని కూడా తెలిపారు మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యోగుల సమస్యల గురించి పరిష్కరిస్తామని ఎజెండాలో తెలిపినారో ఆ అంశాలను తప్పకుండా తూచా తప్పకుండా పరిష్కరించాలని ఈరోజు జరిగిన సమావేశంలో అందరూ అభిప్రాయబడినారు.

ఉద్యోగుల హక్కులను కాపాడుట కొరకు రాష్ట్రంలోని 200 పైబడిన సంఘాలతో టి జేఏసీ ఏర్పాటు చేయడమైనదని తప్పకుండా సమస్యల సాధనకు పోరాడుతామని తెలిపినారు

ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న సమస్త గెజిటడ అధికారులు అందరూ పాల్గొన్నారు.


TEJA NEWS