
ఏఐసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,128 డివిజన్ (చింతల్) అధ్యక్షులు పండరి అధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఉజ్మ శాకీర్ ,మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, మన రాజ్యాంగాన్ని అవమానించే బీజేపీ, దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
బిఆర్ అంబేద్కర్ ను “అవమానించేలా” పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
