
ఏఐసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు 127 డివిజన్ రంగా రెడ్డి నగర్ అధ్యక్షులు బుయ్యని శివ అధ్వర్యంలో ఆదర్శ్ నగర్ ఎన్ .టీ .ఆర్ విగ్రహం నుండి సుమిత్ర నగర్ వరకు నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ జైరామ్, మేడ్చల్ జిల్లా ఓబీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లయ్య కాక , మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్, మొహ్మద్ ఉస్మాన్, కార్యం ప్రకాష్, కె.శ్యామ్ బాబు, పాషా భాయ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు మాధవి రాణి, చిన్నమ్మ, లక్ష్మీ రెడ్డి, లక్ష్మీ, లీలా మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ప్రజలందరికీ తెలియచేస్తూ, జాతిపిత మహాత్మా గాంధీ మరియు రాజ్యాంగ రచయిత అంబేడ్కర్ త్యాగాలను తెలియచేస్తు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
