వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా జక్కంపూడి
-జక్కంపూడి రాజాకు డాక్టర్ గూడూరి శుభాకాంక్షలు
రాజమహేంద్రవరం, :
వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియ మితులైన వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజాకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాలువాతో అభినందించారు.
సరైన సమయంలో సరైన బాధ్యతలు అప్పగించినట్టుగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం చేసేందుకు ప్రజాపక్షాన పార్టీని పునరంకితం చేసేందుకు జక్కంపూడి రాజా సమర్థవంతమైన సేవలు అందిస్తూ యువజన విభాగం పటిష్టవంతానికి నాయకత్వాన్ని అందిస్తారని డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా ఆయన సతీమణి డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ లను సాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జక్కంపూడి రాజాకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, మైనార్టీ సెల్ ఆరిఫ్, ఇన్నీసు పేట అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుత్తుల భాస్కర్ తదితరులు ఉన్నారు.
వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా జక్కంపూడి
Related Posts
ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్.
TEJA NEWS ఏడు కొండల వాడితో పెట్టుకోవద్దు… జగన్ కు లోకేష్ వార్నింగ్. ఫేకు వార్తల జగన్ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విమర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జగన్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నువ్వు…
అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు
TEJA NEWS అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత సీఎంను సునీత కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే సీఎంను…