
పాకిస్తాన్ దాడిలో జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ కమిషనర్ మృతి
హైదరాబాద్:
భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. రాజౌరి పట్ట ణాన్ని టార్గెట్ గా చేసుకుని పాక్ రాత్రి జరిపిన కాల్పుల్లో భారత అధికారి ఒకరు మృతి చెందారు.
అయితే, రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.
అయితే, రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ మృతిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమ ర్ అబ్దుల్లా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
జమ్మూ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అధికారి మృతి చెందడం దారుణం అన్నారు. అంకిత భావంతో పని చేసే ఓ మంచి అధికా రిని కోల్పోయాం అన్నారు. నిన్న నిర్వహించిన వర్చు వల్ సమావేశానికి హాజర య్యారని సీఎం గుర్తు చేశారు.ఇక, జమ్మూలో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది.
అలాగే, సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ వరుస కాల్పులకు పాల్పడింది. పాక్ డ్రోన్లను ప్రయోగిస్తున్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత దళాలు ధ్వంసం చేశాయి. వీటిని ట్యూబ్- లాంచ్డ్ డ్రోన్‌లను ప్రయోగించడానికి ఉపయోగిస్తున్నారు అని రక్షణ శాఖ తెలిపింది.
