
BSP మరియు కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలోకి చేరికలు: మెతుకు ఆనంద్
బంట్వారం మండలం సల్బతాపూర్ మరియు మద్వాపూర్ గ్రామానికి చెందిన BSP మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, అభిలాష్, మల్లయ్య, శ్రీశైలం, గణేష్, నవీన్, శ్రీశైలం, అజయ్ మహేందర్ తదితరులు ఈరోజు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ మేరకు డాక్టర్ మెతుకు ఆనంద్ వారికి గులాబీ కండువా కప్పి BRS పార్టీ లోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ…. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మరియు ప్రజా సంక్షేమం అస్తవ్యస్తంగా మారాయని అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బంట్వారం మండల BRS పార్టీ అధ్యక్షులు మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షులు అల్లపురం శ్రీనివాస్, బంట్వారం మండల BRS పార్టీ ఉపాధ్యక్షులు అశోక్ ముదిరాజ్, నాయకులు ప్రవీణ్ గోరె మియా, నర్సింలు, వీరేశం, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
