
ఈ నెల 16,17,18తేదీ లలో కళా పరిషత్ నాటిక పోటీలు
నాటిక పోటిల్లో నవ నరసాలు పండించనున్న కళాకారులు
పోటీలకు వేదిక కానున్న CR క్లబ్…. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలురానున్నా రంగ స్థల నటులు
ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాCR క్లబ్ పాలక కమిటీ కార్యదర్శి పావులూరి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు చెరుకూరి కాంతయ్య
చిలకలూరిపేట :CR క్లబ్, చిలకలూరిపేట కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16,17,18తేదీలలో CR క్లబ్ ఆవరణలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో రంగస్థల నాటిక పోటీలు జరుగనున్నాయి.
మూడు రోజులపాటు జరిగే ఈ నాటీకలకు చిలకలూరిపేట చుట్టూ ప్రక్కల నుంచి కళాకారులు, ప్రముఖులు, ఔత్సహికులు తరలిరానున్నారు.
రైతే రాజు, చిగురు మేఘం, ఇది రహదారి కాదు,అలీ తో సరదాగా వంటి నాటికల ప్రదర్శన ఉంటుంది.
