Aditi Singh IAS who inspected Anna's canteens
అన్న క్యాంటీన్లను పరిశీలించిన క,ష,న అదితి సింగ్ ఐఏఎస్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గతంలో నిర్వహణలో వుండి మూతబడిన అన్న క్యాంటీన్లను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ పరిశీలించారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఎంఆర్ పల్లి పంచాయతీ ఆఫీసు ముందర, అదేవిధంగా ఈ.ఎస్.ఐ హాస్పిటల్ ముందర, న్యూ బాలాజీ కాలనీలోను, అదేవిధంగా స్విమ్స్ సర్కిల్ వద్ద గతంలో ఏర్పాటు చేసి, అటు తరువాత ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన అన్నా క్యాంటీన్లను కమిషనర్ పరిశీలిస్తూ త్వరలో నూతన ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని అధికారులకు తెలియజేస్తూ వాటి యొక్క స్థితిగతులను కమిషనర్ పరిశీలించడం జరిగింది. మూడు క్యాంటీన్లు ఖాళీగా వున్నాయని, స్విమ్స్ సర్కిల్ వద్దనున్న ప్రైవేట్ క్యాంటీన్‌ను త్వరలోనే ఖాళి చేయించి అన్న క్యాంటీన్ల నిర్వహణకు సిద్దం చేయించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు. అదేవిధంగా బాలాజీ కాలనీలోని గార్బేజ్ సెంటర్ ను, ఎం ఆర్ పల్లి సర్కిల్ నుండి పంచాయతీ ఆఫీస్ వరకు డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ పరిశీలించి ఎప్పటికప్పుడు కాలువల్లో చెత్తను తొలగించాలని, కాలువల్లో చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. తిరుపతి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతిరోజు చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి తమ సిబ్బందికి అందజేయాలని కొంతమంది ప్రజలకు కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తెలియజేయడం జరిగింది. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ మహేష్, సానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పాల్గొన్నారు.