TEJA NEWS

మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా

ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు – జగదీష్ రెడ్డి.

బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట లో మీడియా మాట్లాడిన జగదీష్ రెడ్డి మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీకి వణుకుడు మొదలైంది అన్నారు. చోటే బాయ్, బడే భాయ్ ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రేట్టింపు ప్రజా మద్దతు వస్తుంది అన్నారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్టు, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు.


కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర కు తెర లేపారని అన్నారు.వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ ఢిల్లీ మాటలపై సమాచారం ఉంటే మోడీ ఎందుకు కేసులు పెట్టడంలేదనీ ప్రశ్నించారు.రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడంలేదని ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు.ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే అంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు మద్దతుగ నేతన్నలు కదిలివస్తున్నారని అన్నారు.కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుందని రేపు వివరణకు రానున్న ఓటు కు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉందన్నారు.
అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోరామని కోర్టు నుండి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.


TEJA NEWS