TEJA NEWS

కోల్ కతా అత్యాచార, హత్య ఘటన బాధాకరం.
దోషులను త్వరగా పట్టుకోని శిక్షించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
……………………………………………………………………………..
సాక్షిత జగిత్యాల:
కోల్ కతాలో ఇటీవల జరిగిన పీజీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన ను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రం లోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపి సేవలను నిలిపి వేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర విభాగం పిలుపు మేరకు జగిత్యాల ఐఎంఎ హాల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వైద్యుల, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వారి ఆధ్వర్యం లో నిరసనకు ఎమ్మెల్యే సంజయ్ మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు. అనంతరం వైద్యుల తో కలిసి ర్యాలి లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

ఎమ్మెల్యే మాట్లాడుతూ,

కోల్ కతా లో జరిగిన ఘటన చాలా బాధాకమని, కోల్ కతా ప్రభుత్వం చట్ట బద్ధంగా అన్ని రకాల చర్యలు తీసుకొని పీజీ విద్యార్థి అత్యాచారం హత్య దోషులను పట్టుకొని, శిక్ష విధించాలి.

ఐఎంఎ పక్షాన మహిళలు, వైద్యుల పై ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం..

మెడికల్ కాలేజి సెమినార్ హాల్ లో ఈ ఘటన జరగడం దారుణం..

రాష్ట్రం లో అత్యవసర విభాగ సేవలు కొనసాగుతాయి..

ప్రజలకు సేవ చేసే వైధ్యులపై ఇలాంటి ఘటనలు బాధాకరం..

తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్రం లో వైదుల రక్షణకు తన వంతుగా కృషి చేస్తా..

ఈ కార్యక్రమంలో ఐ ఎం ఎ అధ్యక్షులు డా.తాటి పాముల సురేష్, ప్రధాన కార్యదర్శి డా.అజయ్, వైద్యులు, జగిత్యాల డెంటల్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS