TEJA NEWS

ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ మండిపాటు..

రైతుబంధు విషయంలో సీఎం రేవంత్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని.. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ 11 విడుతల్లో ఆయన ప్రభుత్వం రూ.72వేలకోట్లు రైతుబంధు డబ్బులు నగదు బదిలీ పథకం భారతదేశంలో అతిపెద్ద పథకం. అది సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశారో.. దాన్ని కూడా బద్నాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. రూ.22వేలకోట్లు దుర్వినియోగం జరిగిందని చెబుతున్నరు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వింటే.. మీడియా మిత్రులను కోరుతున్నా. దయచేయి ఆయనేం దేవుడు కాదు.. ఆయన చెప్పింది భగవద్గీత కాదు.. ఖురాన్‌ కాదు.. బైబిల్‌ కాదు’ అన్నారు.

ఎన్ని అబద్ధాలైనా అవలోకగా చెప్పే సామర్థ్యం..
‘ఆయన పచ్చి దొంగ. ఓటుకునోటుకు దొంగ. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. ఎందుకంటే సీఎం ఇవాళ ఎట్ల మాట్లాడిండు? రూ.22వేలకోట్లు రియల్‌ ఎస్టేట్‌ వాళ్లకు వెళ్లినయ్‌. క్రషర్స్‌కు పోయినయ్‌, రోడ్లల్లో ఉన్న భూములకు పోయినయ్‌ అంటున్నడు. ఆయన మాట్లాడితే మైక్‌ కట్‌కాదు. ఎన్ని అబద్ధాలైనా అవలోకగా చెప్పే సామర్థ్యం రేవంత్‌రెడ్డికి. ‘కానీ, వాస్తవం ఏంటీ? నేను మంత్రిని అడిగిన. మంత్రి చెబుతున్నడు. రూ.22వేలకోట్లు సాగు చేయని వాటికి ఏవైతే ఉన్నయో.. అవి కూడా ఉన్నయ్‌ అంటున్నడు. రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు అర్థం కావాలి. ఒక పత్తిచేను ఉంటే.. సంవత్సరంలో ఎనిమిది నెలలు పంట ఉంటది. కంది చేను ఉంటే.. ఎనిమిది నెలలు ఉంటది. పత్తయినా, కందయినా ఎనిమిది నెలల పంట. వీళ్ల లెక్క ఉన్నదంటే.. మిగతా నాలుగు నెలలను రైతులు సహజంగా విడిచిపెడుతారు’ అని కేటీఆర్‌ గుర్తు చేశారు.

ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది..
‘ఆ నాలుగు నెలలను లెక్కలోకి తీసుకొని.. అయినా రెండోవిడత రైతుబంధు ఇచ్చారు.. అవన్నీ దుర్వినియోగమయ్యాయని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నది. కంది, పత్తిని పండించే రైతులకు రేపటి రోజున మీరు రెండో పంటకు రైతుబంధు ఇవ్వరా? పత్తి రైతులు 45లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నరు. వారికి రెండో పంటకు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది కాబట్టే.. రూ.22వేలకోట్లకు నూకి ఇష్టంవచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నరు. నేను ప్రభుత్వాన్ని.. మంత్రిని ఆ లిస్ట్‌ ఇవ్వాలని అడిగాను. క్రషర్స్‌.. రోడ్లల్ల పోయిన భూములు అంటున్నరు ఆ లిస్ట్‌ ఇవ్వాలని అడిగాను. శాసనసభలో పెడితే మాకు తెలుస్తుంది.. ప్రజలకు తెలుస్తుంది. ఎక్కడ ఏ సర్వే నెంబర్‌లో దుర్వినియోగం అయ్యిందో తేలిపోతుందని అడిగాం. కానీ, మంత్రి తెలివిగా చెప్తున్నారు. రెండోపంట పండించని వారి కూడా లిస్ట్‌ ఇందులోనే ఉంది.. ఇవన్నీ కలిపే రూ.22వేలకోట్లు అని చెబుతున్నడు. నేను మళ్లీ చెబుతున్న. పత్తిరైతులు, కంది రైతులు మోసపోకండి. ఆయన మాట్లాడిన రూ.22వేల కోట్లల్లో మీరు ఏదైతో రెండోపంట వేయలేదో దాని గురించే మాట్లాడుతున్నరు’ అంటూ మండిపడ్డారు.


TEJA NEWS