TEJA NEWS

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం…

ఎల్. బి నగర్ : కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట కూల్చడం పై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు….

కాంగ్రెస్ పార్టీ నాయకులతో కామినేని చౌరస్తా వద్దకి తరలివచ్చి నిర్మాణ పనులను పరిశీలించి దిమ్మెను కూల్చివేసిన కాంట్రాక్టర్ ని నిలదీశారు…

ఈ సందర్బంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ….

ఎల్. బి నగర్ MLA దేవి రెడ్డి సుధీర్ ప్రోత్బలంతోనే అధికారులు, కాంట్రాక్టర్లు వైయస్సార్ విగ్రహ దిమ్మెను కూల్చివేశారని, వెంటనే అధికారులు స్పందించి వైయస్సార్ విగ్రహాన్ని పునర్నిర్మించిన తర్వాతనే కాంట్రాక్ట్ పనులు మొదలు పెట్టాలని, డిమాండ్ చేశారు…

అవినీతి ఆర్థిక నేరగాడైన స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ వైయస్సార్ విగ్రహాన్ని ఎప్పటి నుండో తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు…

స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరియు జిహెచ్ఎంసి అధికారులు, ఇతర కాంట్రాక్టర్లు వైయస్సార్ విగ్రహం విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు…

ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఎర్రంబెల్లి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు జోగు రాములు, జైపాల్ రెడ్డి,యాదగిరి, అక్రమ్, శ్యామల్ రెడ్డి, పృధ్వీరాజ్, ఇరిగి రమేష్ సుక్క వెంకట్ , స్వామి,నగేష్ మరియు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS