TEJA NEWS

శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

  • విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపాలి
  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తా డీ ఎస్సీ పరీక్ష నిర్వహిణకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ… ఉస్మానియా యూనివర్సిటీలో గత 11రోజుల నుండి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా నిరుద్యోగులపై, డీ ఎస్సి అభ్యర్థుల పై రాష్ట్ర ప్రభుత్వం లాఠీ ఛార్జ్… ఆపై అరెస్ట్ చేయడం తగదు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, డీ ఎస్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు అన్నారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోని వెంటనే విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


TEJA NEWS