TEJA NEWS

హైదరాబాద్‌: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకునే వారి కోసం డ్యూలింగ్ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను ఇతరులకు బదులుగా ప్రవీణ్‌ రెడ్డి, హరినాథ్‌, కృష్ణ, అరవింద్‌ రెడ్డి, సంతోష్‌, నవీన్‌ కుమార్‌, వినయ్‌లు రాస్తున్నట్లు గుర్తించిన నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించండంతో హోటల్‌పై దాడి చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.ఐదు నుంచి రూ.పది వేలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు, నాలుగు పాస్‌పోర్టులు, ఏడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.


TEJA NEWS