TEJA NEWS

Let's make the Badi Bata program a success

బడి బాట కార్యక్రమం విజయవంతము చేద్దాం

సాక్షిత వనపర్తి
పెద్దమందడి మండలం మణిగిల్ల
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధిచిన బడి బాట కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయు లు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ బడిబాట కార్య క్రమంలో రాష్ట్ర విద్యా శాఖ ప్రణాళిక ప్రకారం జూన్ 6వ తేది నుండి 19 వ తేది వరకు ప్రతి రోజు గ్రామం లో పాఠశాల ఉపాధ్యాయులు , అంగన్వాడి టీచర్స్ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లు కలిసి ప్రతి ఇంటి ని సందర్శించి బడి ఈడు ఉన్న
పిల్లలను అందరిని బడిలో చేర్చే విధంగా తల్లితండ్రులకు వివరించి చెప్పాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న అన్ని రకాల వసతులు ఉదయం పూట అల్పాహారం ,ఉచిత ఆరోగ్య పరీక్షలు , ఉన్నత తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతి గదులు ,దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం ,పుస్తకాలు, నోట్ బుక్స్ ,యూనిఫార్మ్ , మధ్యాహ్న భోజనం ,మొదలైన అంశాలపై అవగాహన కల్పించి అధిక సంఖ్యలో విద్యార్థులను
ప్రభుత్వ పాఠశాలలో చేర్చి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని అన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయులు అధిక అర్హత కలిగి ఉన్నారు. కావున బడి బయట ఉనా పిల్లలు అందరూ కూడా స్కూల్ లో చేర్పించేందుకు కృషి చేద్దామని కోరారు.
ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. వెంకటేష్.ఉపాధ్యాయులు వెంకటేష్ గౌడ్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం.జ్యోతి, నాగేశ్వరమ్మ, శ్రీలక్ష్మి,అంగన్‌వాడీ టీచర్లు అరుణ, రాధ, స్వయం గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS