
పరికిచెరువును కాపాడుకుందాం.
చెరువుల పరిరక్షణ కమిటీ.
జగద్గిరిగుట్ట,కూకట్పల్లి, గాజులరామారం ప్రాంతాలకు విస్తరించి ఉన్న పరికిచెరువు నేడు అన్యాక్రాంతమయితుందని దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని, ఒకవేళ కాపాడుకోలేకపోతే గత సంవత్సరం బెంగళూరులో జరిగినటువంటి ఆ నీటి కొరత ఏర్పడి ప్రజలు మంచినీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాబట్టి గాజులరామారం, కూకట్పల్లి,జగద్గిరిగుట్ట ప్రాంతవాసులందరూ ఈ చెరువు పరిరక్షణ కొరకు తమ వంతుగా పాటుపడాలని నేడు మక్దుమ్ నగర్ లో చెరువుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. 62 ఎకరాలు,ఉండాల్సిన పరికిచెరువు నేడు కబ్జాలు గురి కావడం వల్ల 10 నుంచి 15 ఎకరాల లోపు మాత్రమే ఉన్నదని ఇప్పటికైనా దీన్ని కాపాడుకో లేకపోతే రానున్న రోజుల్లో సమస్యలు ఏర్పడతాయని కాబట్టి వెంటనే పరికిచెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని కమిటీ భావించింది. మూడు వారాల క్రితం హైడ్రా కమిషనర్ పరికిచెరువుని సందర్శించి పరికిచెరువును కాపాడుతానని గత సమావేశంలో కూడా చెప్పడం జరిగింది కానీ నేడు మళ్లీ భూకబ్జాదారులు పరికిచెరువులో మట్టిని పోసి పుడుస్తున్నారని ఈ విషయాన్ని మళ్లీ ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, అదేవిధంగా ప్రజాదర్బార్ లో కూడా కంప్లైంట్ చేసి పరికిచెరువు కాపాడటం పనిచేస్తామని, దానికి రాజకీయ పార్టీల నాయకులు,పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలిసి రావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఉమా మహేష్, సాయి కుమార్ పంతుల, పవన్, జంబు,మోహన్ ప్రభాకర్ పాల్గొన్నారు.
