TEJA NEWS

గ్రామ సచివాలయం గదుల్లోనే మద్యం సీసాలు

ఎమ్మెల్యే ఆకస్మిక పరిశీలనలో వెలుగు చూసిన వైనం

సిబ్బందిని మందలించిన ఎమ్మెల్యే

తక్షణమే మొత్తం శుభ్రం చేయించి, కార్యాలయంలో మద్యపానం అరికట్టాలని స్పష్టం చేసిన ఎమ్మెల్యే

అవనిగడ్డలో గ్రామ సచివాలయం-1 కార్యాలయం గదుల్లోనే మద్యం సేవిస్తున్నారు. కార్యాలయం గదుల్లో, మెట్లపై ఎటు చూసినా తాగిపడేసిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. రెవిన్యూ సదస్సుకు విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక పరిశీలన చేయగా ఈ పరిస్థితి దర్శనమిచ్చింది. గ్రామ సచివాలయంలో ఎటు చూసినా మద్యం సీసాలు కనిపించటం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం గదుల్లో కూడా మద్యం సీసాలు కనిపించడంతో ఇదేమిటని ప్రశ్నించారు.

గ్రామ సచివాలయంలోనే మద్యం తాగుతుంటే ఏం చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి అనితను ప్రశ్నించారు. బయటి వారు రాత్రివేళల్లో వచ్చేస్తున్నారని అనిత తెలిపారు. ఇతరులు లోపలికి రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ భవనం, గదులు తీవ్ర అపరిశుభ్రతగా ఉండటాన్ని పరిశీలించారు. తక్షణమే కార్యాలయం మొత్తం శుభ్రం చేయించాలని, మద్యం తాగేవాళ్ళు లోపలికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


TEJA NEWS