TEJA NEWS

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా..

రంగా విగ్రహం సాక్షిగా తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

కాపు భవనం,నిర్మాణానికి రూ 25 లక్షలు ఆర్ధిక సహాయం..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతానని, పాలన అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) రంగా విగ్రహం సాక్షిగా తెలిపారు.. వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా రంగా అభిమాని దేవరకొండ శ్రీను కావలి పట్టణంలోని రైతు బజార్ ఎదుట ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని నివాళులర్పించారు.. ముందుగా రంగా విగ్రహ కమిటీ ఏర్పాటు చేస్తున్న రంగా విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని తెలిపారు. నాయకునికి కీర్తి డబ్బు, పదవులతో రాదని, పేదలను అక్కున చేర్చుకుంటే వస్తుందని తెలియజేసిన వ్యక్తి మోహన రంగా అని అన్నారు.. పేదల కోసం నిరంతరం పరితపించిన రంగా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని అన్నారు.. ఆయన ఆశయ సాధనలో కాపు నాయకులు, టీడీపీ నాయకులు పనిచేయాలన్నారు.. అతి తక్కువ సమయంలోనే విగ్రహ కమిటీ సభ్యులు విగ్రహ ఏర్పాటు పనులను పూర్తి చేయడం జరిగిందని, రాష్ట్ర నాయకులను ఆహ్వానించి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు భవనం, నిర్మాణానికి రూ 25 లక్షలు ఆర్ధిక సహాయం అందజేస్తానని


TEJA NEWS