
మెరుగైన వైద్యం కోసం
ఎల్.ఓ.సి పత్రం అందజేత
కూటమి నేతలతో కలిసి అందించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆంధ్రా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితుడు పిచ్చుక లింగారావుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం ఎల్.ఓ.సిపత్రాన్ని అందజేశారు.
హెచ్ బీ కాలనీ కు చెందిన పిచ్చుక లింగారావు(78) ఇటివల రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు.
మెరుగైన చికిత్స కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రూ 2, లక్షల 39 వేల ఎల్ ఓ సి పత్రాన్ని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమినేతలు పచ్చవ మల్లిఖార్జున, దొడ్ల రాజా, దేవిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
