TEJA NEWS

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భీమిని పట్నం, ఇందిరమ్మ కాలని,పీకే రామయ్య కాలనీలోని 90 ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా చిరు కనుక అందజేసినట్లు మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ,2019 లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ లో నేను రెండోవ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది అప్పుడు తక్కువ ఓట్ల తో ఓడిపోవడం జరిగిందని ఇదే రంజాన్ పండుగ సమయంలో కరోనా వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో పండుగ రోజున
నా వార్డులోని ముస్లిం కుటుంబాలు ఇబ్బంది పడద్దని ఆ రోజున చేసిన ఈ ఆలోచన నేను బ్రతికున్నన్ని రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తానని 2020 లో మాట ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా ఇది నాల్గోవ సంవత్సరం కార్యక్రమం అని మల్లేష్ తెలిపారు
41 రోజల పాటు కటీరమైన ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ మా డివిజన్లో ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలకు మూడు సంవత్సరాల నుండి చిరుకానుక అందిస్తున్నానని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ రోజున ఏ ఒక్క కుటుంబం కూడా బాధతో ఉండకూడదని ఆలోచన చేసి గత మూడు సంవత్సరాల నుండి రెండవ వార్డ్ కు చెందిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సమయంలో అండగా ఉంటున్నానని ఈ కుటుంబాలకు ఈ రంజాన్ కిట్స్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని 41ఒక్కరోజల పాటు ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకునే పండుగ రోజున ప్రతి కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ ఆలోచన చేయడం జరిగిందని నా ఈ కార్యక్రమాన్ని చూసి తన వంతు సహాయం అందించడానికి ముందుకు వచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు గౌతమి నగర్ కు చెందిన సభ్యులు అన్న గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి వారి యొక్క కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యల గురించి ఆర్థిక సమస్యల గురించి వాళ్లు ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ అల్లా అ కుటుంబాలను దర్శించి
వారి కోరికలను తీర్చాలని మనస్ఫూర్తిగా ఆ అల్లా ను కోరుకుంటున్నానని. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కుటుంబానికి మరియు నా రెండో డివిజన్ ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో పుల్లూరి నాగభూషణం,పెనుగొండ తిరుపతి,దావుద్,మహమ్మద్ కంరోద్దీన్,మిరియాల వెంకట్,సందీప్,ముత్యాల వివేక్,చిన్న వెంకట్,తదితరులు పాల్గొననున్నారు


TEJA NEWS