Spread the love

ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు కలిసి రాని మహాశివరాత్రి.

( పల్నాడు ప్రత్యేక కథనం) నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మహాశివరాత్రి కలిసి రాలేదని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వెళ్లే ప్రభల వ్యవహారంలో వివాదం నెలకొన్న విషయం పాఠకులకు విదితమే. అదే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి వారికి వివాదం నెలకొని మాజీ మంత్రి విడదల రజని మామ కారు అద్దాలు పగలగొట్టిన విషయం నియోజవర్గ ప్రజలకు తెలిసిన విషయమే. గతంలో అధికారంలో ఉన్న పార్టీవారు గాని, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీవారు గానీ ప్రజలకు వరగపెట్టిందేమీ లేదని, ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


ప్రజలకు ఏదో చేస్తామని, ఊహల పల్లకిలో విహరించేలా చేసి ఏమి చేయకపోగా ప్రజా దనమే దుర్వినియోగం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పురపాలక సంఘంలో అవినీతిరాజ్యమేలింది. ప్రతి మాసం ఏదో ఒక విభాగంలో ప్రజాధనం కాజేచేశారని కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్, పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నత అధికారుల వద్ద ఫిర్యాదులు ఎదుర్కొన్నారు.అధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసారు అని చెప్పుకోవాలి. అక్రమ లేఔట్లు వేసి భూములు అమ్మకం చూపిన వారికి ఆయా వెంచర్లలో కాలువలు, సిమెంటు రోడ్లు కూడా వేసి తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు. పన్నుల రూపంలో పురపాలక సంఘానికివచ్చిన ఆదాయాన్ని కొందరు ఉద్యోగులు స్వాహా చేశారు.” తిలాపాపం తలా పిడికెడు ” అనే విధంగా ఎవరు పాత్ర వారు పోషించారు. పురపాలక సంఘాన్ని దున్నేశారు, దోచేశారు, ఆ తదుపరి దువ్వేశారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన, గత ప్రభుత్వంలోని కొందరు రాజకీయ నిరుద్యోగులు, నాయకులు శాసనసభ ఎన్నికల సమయంలో, ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయించటం జరిగింది. అప్పటిదాకా వారు దోచుకున్న ప్రజాధనం ప్రతిపక్ష పార్టీ గెలవడంతో గప్చుప్ సాంబార్ బుట్టిగా నెలకొంది. అప్పటిదాకా గగ్గోలు పెట్టిన అధికార పార్టీకి సంబంధించిన పాత్రికేయులు కలం కదలలేదు నోరు మెదలలేదు. అలాగే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన అక్రమ భవన నిర్మాణాలు కొనసాగించిన వారు ప్రస్తుత అధికార పార్టీకి, గత అధికారపార్టీకి కొమ్ము కాయడంతో, కులం వారు కావటంతో, వారి భవనాలకు వీరే కవచాలుగా నిలబడి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు. జనజీవన స్రవంతి లేని చోట లక్షల ఖరీదు వెచ్చించి వారి భవనాలకు సిమెంట్లు రోడ్లు సైతం వేయించారు. అదే గత ప్రభుత్వంలో పనిచేసిన 8 మంది కాంట్రాక్టులకు 80 వర్కులకు గాను కోట్ల రూపాయల లోనే బిల్లులు మాత్రం చెల్లించలేదు. వారు మాత్రం న్యాయస్థానాలు చుట్టూ తమ బిల్లుల కోసం తిరుగుతున్నారు. ప్రస్తుత అధికార పార్టీ గెలవగానే పాత కాంట్రాక్టర్లును అలా ఆపి కొత్త వారికి కొన్నిబిల్లులు చెల్లించారు.


బార్ షాపులు,వైన్ షాపులు, సమయపాలన పాటించటం లేదని, దేవాలయాలు మసీదులు చుట్టూ నిర్మించారని,గ్రావెల్, ఇసుక, అమ్ముకుంటున్నారని, గక్గోలు పెట్టిన నాయకులు కనుచూపుమేరలో కాన రావటం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా మారిపోయారా? భయంతో బతుకుతున్నారా? ఆక్రమణల వ్యవహారంలో శాసనసభ్యుని ఆశయం నెరవేరిందా లేదా? గత ప్రభుత్వంలో పురుషోత్తపట్నం శివారు చిలకలూరిపేట గా ఉన్న పురుషోత్త పట్నంవారికి, మండలంలోని కమ్మవారిపాలెం గ్రామస్తులకు, గొడవ జరిగితే, ప్రస్తుతం ఒకే గ్రామంలో అన్నా, మామ, తమ్ముడు, బాబాయ్, అనుకుంటూ బంధుత్వాలు, స్నేహాలు కలిగిన ఒకే గ్రామ వ్యక్తులపై కేసును నమోదు అవ్వటం గమనించదగిన విషయం. వివిధ రాజకీయ పదవులు ఆశిస్తున్న వారిపై ఈ కేసులు నమోదవడం, పదవికి అర్హులా? అనర్హుల? రాజకీయ నాయకులు రగల్చిన హోమం కొండెక్కకుండా ( ఆరిపోకుండా) సమెదలుగా మిగిలిపోనుంది అధికారులు, ఉద్యోగులేనా?
(వంటి అంశాలతో, కూటమి ప్రభుత్వం విజయం అనంతరం, వివిధ నియోజకవర్గాల పనితీరు ప్రత్యేక కథనంగా రెండవ భాగం అందిస్తాం )