మాలల మహా పాదయాత్ర ను విజయవంతం చేయండి
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
నవంబర్ (మంగళవారం 12)
మాల మహా నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య…
మాలల కోసం జరిగే మహా పాదయాత్రను మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాలల మహా పాద యాత్ర పోస్టర్ ను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఈనెల 25 భద్రాచలం నుండి పాదయాత్ర చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య తెలిపారు. 16 జిల్లాలో 35 నియోజకవర్గాల్లో డిసెంబర్ 1 వరకు పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని, డిసెంబర్ 1 నా హైదరాబాదులో మాలల మహాసంగ్రామ సభఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.దీనిలో భాగంగా ఈ నెల 15 వ తేదీన రాయపట్నం మీది నుండి జగిత్యాల వరకు సాగే మహా పాదయాత్ర కు ధర్మపురి నియోజక వర్గం నుండి మాల సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మాల మాల ఉపకులాల వర్గీకరణను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు….ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పోనగంటి రాజన్న,జిల్లా కార్యదర్శి చెనెల్లి సుమన్,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పులి లక్ష్మణ్,ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక కిరణ్,మండల ఉపాధ్యక్షుడు అలుగునూరి సతీష్, మండల నాయకులు,తరాల్ల తిరుపతి, కుశ వినోద్,కండ్లే పోచయ్య,కొప్పుల రత్నం,బెత్తెపు రాజారావు,మా ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.