TEJA NEWS

పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ – 2024 ముగింపు మరియు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి ఎంపీ డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ తో కలిసి సీఎం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హాబ్ గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, యువత సోషల్ మీడియా, ఇతర వ్యాసనాలకు బానిసలు కాకుండా క్రీడాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రయత్నించి ఓడిపోవచ్చు కానీ… ప్రయత్నించకుండా ఓడిపోకూడదని అన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అప్పుడే మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటామని తెలిపారు. ముఖ్యంగా బాలికలు క్రీడాలలో రాణించాలంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం చాలా మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని కావున ప్రతీ ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిందని తెలిపారు. రానున్న రోజులలో ఏసియా గేమ్స్, ఒలంపిక్స్ పోటీలలో అత్యధిక పథకాలు సాధించేందుకు గ్రామ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను గుర్తించి వారికీ అన్ని రకాల వసతులు కల్పించి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పిల్లలందరికి చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో భాగస్వామ్యం కావాలని ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహించాలని తెలిపారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని అన్నారు. విద్యార్థులు, క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడాలలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS