ఆర్టీసీ బస్సులో వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్:
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తు న్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో మంగళ వారం ఉదయం వెలుగు చూసింది.
యాదాద్రి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్రమత్త మైన కండక్టర్ సహా తోటి ప్రయాణికులు గుండె పోటు వచ్చిందని గుర్తించారు.
అనంతరం తోటి ప్యాసింజర్ ఒకరు సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆ వ్యక్తికి ఊపిరి తీసుకోవడం కష్టం గా మారడంతో ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు గుండెపోటుకు గురైన వ్యక్తి గురించి ఆరా తీశారు. మృతుడు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన గీతాకార్మికుడు డొంకెని పాండు(59)గా గుర్తించారు.
విచారణ తర్వాత చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.