TEJA NEWS

చెన్నూర్ నియోజకవర్గం..

మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దెరేగడిలోని భీమా గార్డెన్స్ లో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి అధ్యక్షతన జరిగిన చెన్నూర్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు , తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్, మంచిర్యాల జిల్లా అబ్సర్వర్ జంగా రాఘవ రెడ్డి , పీసీసీ మెంబర్ చిన్నబ్బు రాంభోపాల్ ..

అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి గారు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ని శాలువాతో సన్మానించారు..

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సురేఖమ్మకు ఘన స్వాగతం పలికారు..

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, మండలాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..