ధూల్‌పేట : మంగళ్‌హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం సీపీ దృష్టికి రావడంతో కార్యాలయానికి పిలిపించి ఉత్తర్వుల కాపీని చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యతను డీఐ విస్మరించి.. తన పుట్టిన రోజు వేడుకల్ని జూదం నిర్వహిస్తున్న స్థావరంలోనే జరుపుకొన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం విశేషం. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అర్ధరాత్రి పూట జూద గృహానికి వెళ్లినట్లు, అక్కడే కేక్ కోసి జూదరులతో సంబరాలు చేసుకున్నట్లు తేలింది. ఠాణా పరిధిలోని గంజాయి విక్రేతలు, జూదం నిర్వహిస్తున్న వ్యక్తులు, రౌడీషీటర్లతో చనువుగా మెలుగుతూ అంతా తానై వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుతం గుసగుసలు మొదలయ్యాయి……