
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా పలు వార్డుల కార్యవర్గాల ఎన్నిక నిర్వహించిన పార్టీ శ్రేణులు
చిలకలూరిపేట: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో గ్రామాలలో, వార్డులలో పార్టీ కార్యవర్గాల ఎన్నిక కార్యక్రమాన్ని పార్టీ నేతలు గురువారం నుండి ప్రారంభించారు. ఎన్నిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 7 వ మరియు 19 వ వార్డులలో స్థానిక నేతలు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపారు. వార్డుల కార్యవర్గంతో పాటు నూతనంగా బూత్ కో కన్వీనర్, యూనిట్ కో కన్వీనర్, క్లస్టర్ కో కన్వీనర్ వంటి పదవులకు కూడా అభిప్రాయ సేకరణ జరిపారు. అన్ని వార్డులలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తి చేశాక కార్యవర్గాల ఎంపిక చేయటం జరుగుతుందని పార్టీ నేతలు తెలియజేశారు.సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు షేక్ కరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, పార్టీ అధికార ప్రతినిధి మురకొండ మల్లిబాబు, షేక్ బాజీ, పూల పాపా రావు, అబ్దుల్లా, యేసు బాబు, రఫీ, జానీ భాషా తదితరులు పాల్గొనడం జరిగింది.
