TEJA NEWS

వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, వివేకానంద నగర్, కూకట్పల్లి(పార్ట్) డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం జరిపిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ GHMC ఇంజనీరింగ్ విభాగం మరియు అన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లవేళలలో అందుబాటులో ఉండలని, ప్రజా సమస్యల పై అధికారులు నిర్లిప్తతను విడాలని, మీ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యల పై స్పందించే అవసరం ఎంతైనా ఉంది అని,
అదేవిధంగా G HMC అధికారులు మరియు అన్ని విభాగాల అధికారులు సమన్వయం తో పనిచేస్తూ ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్లాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో నెలకొన్న రోడ్ల సమస్యలను ప్రథమ ప్రాధాన్యత గా పరిగణలోకి తీసుకోని త్వరిత గతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని, పనులలో వేగం పెంచాలని అలసత్వం ప్రదర్శిచకూడదని, పెండింగ్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరం ఉన్న చోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని, మంజూరైన అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయాలని, శంకుస్థాపన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు తెలియచేసారు.

రాబోయే వర్షాకాలం లోపు నాలల పూడికతీత పనులు వేగవంతం చేయాలని, వర్షాకాలంలోపు నాలలలో పేరుకుపోయిన చెత్త చెదారం ను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వర్షాకాలంలో వచ్చే లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు.

కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ప్రజలకు ఎల్లవేళలలో అందుబాటులో ఉండి,క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని, అన్ని కాలనీ లను సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పని చేయాలని, కాలనీ లలో చేపడుతున్న పనులలో వేగం పెంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE గోవర్ధన్ గౌడ్ DE రమేష్ , DE నిఖిల్ AE రాజీవ్,AE శ్రావణి, AE సాయి ప్రసన్న మరియు తదితరులు పాల్గొన్నారు.