జగిత్యాలలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు ..
బత్తిని సంతోస్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు…
జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు…
రిమాండుకు సంబందించి ప్రెస్‌నోట్ ను పోలీసులు విడుదల చేశారు…
జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌లో ఈ నెల 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళుతున్న గంగారెడ్డిని …
అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ అనే యువకుడు కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు..
ఈ కేసు జగిత్యాలలో సంచలనం కల్గించగా జగిత్యాల రాజకీయాల్లో అలజడి రేగాయి..
హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి దాదాపు మూడు గంటల పాటు జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్వయంగా దర్యప్తు చేపట్టారు…
నిందితుడి వెనుక ఎవరైన ఉండి ఉంటారని.. రాజకీయ హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపించారు..
అయితే ఎట్టకేలకు నిందితుడిని ఈ రోజు రిమాండుకు తరలించారు