TEJA NEWS

దమ్మపేటలో పట్టుబడిన దుప్పి మాంసం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం,దమ్మపేట మండలం,జగ్గారం గ్రామంలో ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన తోటలో 5 కేజీల దుప్పి మాంసం,చర్మం లభించినట్లు వచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఎవరూ పట్టుబడులేదని సమాచారం.