
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి
గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో , ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలోజరిగినటువంటి సమావేశాలలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న సొంటిరెడ్డి పున్నారెడ్డి . తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకెళ్లాలని దానికోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ప్రభుత్వం వస్తున్నటువంటి కార్యక్రమాలని తెలియజేయాలని కోరడం జరిగినది.
