
*శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు..
ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవము పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, రఘూవేంద్ర రావు గార్లు హాజరై ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ప్రసాద్ రాయుడు, విజయ్, చౌదరి, సురేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
