TEJA NEWS

లేని వాలంటీర్లకు వేతనాలు ఎలా?: మంత్రి డోలా

అమరావతి: వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘వాలంటీర్లను వైకాపా ప్రభుత్వం రెన్యూవల్‌ చేయలేదు. గత ప్రభుత్వ చర్యల వల్లే ఆ వ్యవస్థ మనుగడలో లేకుండా పోయింది. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మేం ప్రయత్నించాం. కానీ.. లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి? వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్లం’’ అని డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.


TEJA NEWS