TEJA NEWS

సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల చేసి, సాగు, తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

శింగనమల నియోజకవర్గము :

పుట్లూరు మండలం లోని సుబ్బరాయసాగర్ నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు,ప్రజల కు తాగునీటి విషయమై,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే KM 84.00 నుండి KM 86.00 వరకు ఉన్న MPSC కెనాల్ ను పరిశీలించి, గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం తో కాలువ పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి పోయింది. నీరు సరిగా కాలువలో పారెందుకు ఉన్న రాళ్లను,వ్యర్థాలను తొలగించేందుకు సంబంధించిన అధికారులును కొద్దీ రోజుల క్రితం ఆదేశించడమైనది.

అలాగే హెచ్.ఎల్.సి. శాఖ అధికారులు తో సమీక్షలు నిర్వహిస్తూ, సాగునీటి,తాగునీటి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయడమైనదని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పేర్కొన్నారు. నీటి సరఫరా ప్రవాహం 130 రోజులు ఒకేలా ఉండే విధంగా అధికారులుకు నిర్దేశించినట్లు తెలిపారు. సుబ్బరాయ సాగర్ నీటి విడుదల తో, పుట్లూరు, గరువుచింతల, కోమటికుంటల గ్రామ చెరువుల కు నీరు చేరిక పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు


TEJA NEWS