
తిప్పనపల్లి పంచాయతీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. ఇందిర బడిబాట కార్యక్రమం ద్వారా తిప్పనపల్లి,మహామ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులు 3,05,000.రూ,నిర్మించిన డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను ప్రారంభించారు.
