
ప్రభుత్వ పథకాలు పేదలకు అందిస్తాం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని మంగయ్య బంజర గ్రామంలో,పేదలకు ఆవాసం కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.ఇందిరమ్మ ఇళ్లతోపాటు ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగేలా చూడటం తన ప్రాధాన్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్ కుమార్, హౌసింగ్ జేఈ జి రాము మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇందిరమ్మండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
