
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే
హైదరాబాద్:-
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
బట్టి విక్రమార్కని వారి ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు కాబడిన పోడుభూములను సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పముతో 100% సబ్సిడీతో సోలార్విద్యుత్ బోర్లు మోటార్లు ఇస్తున్న తరుణంలో
చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన శాసనసభ్యులు.
జారె ఆదినారాయణ
అదేవిధంగా అశ్వారావుపేట మండలం ఆకుపాకలో 225/33KV మంజూరు చేసినందుకు ధన్యవాదములు తెలుపుతూ ములకలపల్లి మండలం కమలాపురంలో 225/33KV లు శాంక్షన్ కొరకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో కావడిగుండ్ల అశ్వారావుపేట అచ్యుతాపురం తిరుమలకుంట పార్కలగండి గ్రామాలలో నూతనంగా మంజురైన విద్యుత్ సబ్ స్టేషన్ల శంకుస్థాపనలకు పైలట్ ప్రాజెక్ట్ బెండాలపాడు గ్రామంలో బోర్ల ప్రారంభోత్సవాలకు విచ్చేయాలని ఇన్విటేషన్ అందజేశారు.
