TEJA NEWS

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వరావుపేట మండలంలో అచ్చుతాపురం లో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అచ్చుతాపురం టీమ్ విన్నర్, భీముని గూడెం టీమ్ రన్నర్ గా నిలిచింది.
అచ్యుతాపురం గ్రామంలో గ్రామపెద్దల సహకారంతో అచ్యుతాపురం యూత్ ఆధ్వర్యంలో ACP-7 అచ్యుతాపురం ప్రీమియర్ లీగ్ -7 రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటులో మొదటి నాలుగు స్థానాలలో విజేతలుగా నిలిచిన దమ్మపేట A టీమ్,అచ్యుతాపురం కమిటీ టీమ్,దమ్మపేట B టీమ్, భీమునిగూడెం టీములకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మరియు అశ్వారావుపేట మండల నాయకులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని అచ్చుతాపురం టీమ్ కు బహుమతి అందజేశారు .