TEJA NEWS

ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

గండుగలపల్లి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ హృదయపూర్వకంగా అభినందించారు.అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇది అశ్వారావుపేట నియోజకవర్గ విద్యా స్థాయిని ప్రతిబింబించడమే కాక ఉపాధ్యాయుల కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహానికి విద్యార్థుల పట్టుదల‌కు నిదర్శనమన్నారు. అశ్వారావుపేట జవహర్ విద్యాలయంలో చదివే పి సాయిసంతోష్, కె వర్షిణి, సిహెచ్ శాంతి అను విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించటంతో ప్రత్యేకంగా సన్మానం నిర్వహించి విద్యార్థులను ప్రశంసిస్తూ యాజమాన్యాన్ని అభినందించారు.