TEJA NEWS

గుత్తి ఆనంద్ ఇంట అయ్యప్ప స్వాముల బీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకర్పల్లి : శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామానికి చెందిన గుత్తి ఆనంద్, తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వాములకు బీక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు,తదుపరి యాదయ్య ను గుత్తి ఆనంద్ శాలువాతో సన్మానించారు. అనంతరం భక్తులంతా అన్నప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా, కాలే యాదయ్య మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని అభిప్రాయపడినారు.ఈ కార్యక్రమంలో కాలే యాదయ్య, కొండకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలక్ష్మణ్, గ్రామ మాజీ సర్పంచ్ కాశీనాథ్ గౌడ్, గుత్తి పాండ్రయ్య,గుత్తి వెంకన్న ,గుత్తి ఆనంద్ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.


TEJA NEWS