TEJA NEWS

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

చేవెళ్ల మండలం సింగప్పగూడ గ్రామంలో మరియు చేవెళ్ల పట్టణం లోని సీపీఐ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిబోయే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.

అనంతరం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.