అమాత్యుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మాత్యులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిసి మంత్రి కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి వనపర్తి ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేస్తూ వనపర్తి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని, సహకారం అందిస్తానని మంత్రివర్యులు పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు
కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు