TEJA NEWS

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ మర్డర్ కేసు రీ ఓపెన్.. జిల్లా ఎస్పీ సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022లో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబుపై కేసును రీ ఓపెన్ చేయాలని కాకినాడ జిల్లా ఎస్సీ బిందు మాధవ్ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఈ కేసు విచారణ అధికారిగా SDPO మనీష్ దేవరాజ్ పాటిల్‌ (Manish Devraj Patil)ను నియమించారు. అలాగే ఈ కేసును రి ఓపెన్ చేసి.. 60 రోజుల్లో దర్యాప్తు నివేదికను డీజీపీకి, కాకినాడ జిల్లా ఎస్పీకి ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు ఛార్జ్ షీట్ వేయాలని SDPO మనీష్ దేవరాజ్ పాటిల్‌ జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే ఈ కేసులో వారికి న్యాయ సలహాల కోసం ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ళ సుబ్బారావును ఏపీ ప్రభుత్వం నియమించింది. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్సీ అనంత బాబు తో పాటు, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

మర్డర్ కేసు వివరాలు..

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యం మధ్య 25 వేల రూపాయల విషయంలో వివాదనం నెలకొంది. ఈ క్రమంలో అతన్ని మాట్లాడేందుకు పిలచిన అనంత బాబు.. తన స్నేహితులతో డ్రైవర్ సుబ్రహ్మణ్యంపై దారుణంగా దాడి (rutally attacked) చేశారు. ఈ దాడిలో డ్రైవర్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఎమ్ చేయాలో తెలియక రోడ్డు ప్రమాదం గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ శరీరం మొత్తం కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపించడంతో దళిత సంఘాలు ఎమ్మెల్సీ అనంత బాబు పై అనుమానం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.

అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి అనంత బాబు వ్యాపార రహస్యాల తో పాటుగా అతని వ్యక్తిగత జీవితం (అక్రమ సంబంధాలు) గురించి తెలుసు. వీటిని బయటపెట్టవచ్చనే భయంతో హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం పోలీసులు విచారణలో తానే సుబ్రహ్మణ్యంపై దాడి చేయడంతో మరణించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులు అతనినై ఛర్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. కాగా కొద్ది రోజుల క్రితం ఆయన బెయిల్ పై జైలు నుంచి విడుదల కాగా వైసీపీ శ్రేణులు అతనికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.