ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే అండగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సి అభ్యర్థి మల్లన్నతో పాటు,మాజీ ఎమ్మెల్సి కపిలవాయి దిలీప్ కుమార్, డాక్టర్ కత్తి వెంకట స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….పట్టభద్రులు ఎంతో విజ్ఞత కలవారని, వారికి ఎవరు ప్రతినిధిగా ఉంటే న్యాయం జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ తోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతుంది అని అన్నారు. ఏ అధికారం లేనప్పుడే ప్రజా సమస్యలపై పోరాడిన నికార్సైన వ్యక్తి మల్లన్న అని అధికారం ఉంటే ప్రజా సమస్యలపై ఎంత దూరం అయిన పోగల సమర్ధ నాయకుడు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా యువత కు అన్ని హామీలు నెరవేరేలా కృషి చేస్తా అని అన్నారు.పట్ట భద్రులు తమ అమూల్యమైన ఓటు రెండవ నెంబర్ దగ్గర 1 అని రాసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్, నగర కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి,మాజి ఎం ఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర ఓబిసి సెల్ ఉపాద్యక్షులు వడ్డేబోయిన నరసింహారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు,తండు శ్రీనివాస్ యాదవ్, పి సి సి సభ్యులు జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, మడూరి ప్రసాదరావు, జిల్లా ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆదరించండి అండగా ఉంటాఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…