TEJA NEWS

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట్ కార్పొరేషన్ ను మోడల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేశాం… రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరుస్తాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్, 17వ డివిజన్ కౌసల్య కాలనీ, 18వ సాయి అనురాగ్, 20వ డివిజన్లలోని పూజిత ఎంక్లెవ్ కాలనీలలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు, నూతన కాలనీల వాసులు కాలనీలలో నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, వీధి దీపాలను, పొల్యూషన్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా వెలుస్తున్న కాలనీలలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజానీకానికి రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఆగం రాజు, బాలాజీ నాయక్, రాఘవేంద్ర రావు, గాజుల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి సతీష్, మున్సిపల్ డిఈ యూనిస్, ఏఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్ర మోహన్, మేనేజర్ సౌమ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుకృతా రెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాశ్, నాయకులు బొర్రా చందు, ప్రదీప్, సాంబశివారెడ్డి, ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.