TEJA NEWS

హైదరాబాద్‌: రేషన్‌, గ్యాస్‌ దందాకు కేంద్రంగా మారిన రాజధానిలో డివిజన్‌కు 8 చొప్పున ప్రతి నెలా దాదాపు 1,200కు పైగా వాహనాలు పట్టుబడుతున్నాయి. అందులో లారీలు, ట్రాలీ, ప్యాసింజర్‌ ఆటోలు ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యంతో పాటు అక్రమ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ కేంద్రాల నుంచి తరలిస్తున్న వందలాది సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఓ డివిజన్‌లో పట్టుబడిన వాహనం మరికొద్ది రోజుల్లో మరోచోట అదే తరహాలో దొరికిపోతుండటం గమనార్హం. కేసులు నమోదు చేసినా స్టేషన్‌ బెయిల్‌ లభిస్తుండటంతో తిరిగి చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. పట్టుబడిన వాహనం రెండోసారి స్వాధీనం చేసుకుంటే లైసెన్సు రద్దుకు రవాణాశాఖకు ప్రతిపాదించాలని.. అప్పుడే వారిలో భయం నెలకొంటుందని అవినీతిపై పోరాటం చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

ఏటా 1,500కు పైగా కేసుల నమోద

రాజధాని పరిధిలోని మూడు జిల్లాలకు ప్రతినెలా 43వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం రేషన్‌ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇలా పంపిణీ చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారుల నుంచి కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేస్తూ కర్ణాటక, మహారాష్ట్రకు పంపుతున్నారు. పట్టుబడితే రేషన్‌ డీలర్లపై నమోదు చేసే 6ఏతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో ఏటా 1,500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ పంచనామా నిర్వహించి రేషన్‌ బియ్యంగా నిర్ధారణ చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారే తప్ప..ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు…


TEJA NEWS