TEJA NEWS

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
127 – రంగారెడ్డి రంగారెడ్డి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి గెలుపుకై ఇంటింటి ప్రచార నిర్వహణపై నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుగారు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరై నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో చేయవలసిన విధానాలపై పలు విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పార్టీల గెలుపుతో తెలంగాణకు ఎటువంటి న్యాయం జరగదని అదే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్లోని సమస్యలపై పార్లమెంట్లో కొట్లాడి మన హక్కులను సాధించుకోవడంతో పాటు అధిక నిధులు రాబట్టవచ్చన్నారు. గత ఐదేళ్ల క్రితం రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఊహించిన మల్కాజ్గిరి ప్రజలకు అభివృద్ధి పోగా అవస్థలే మిగిలాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బి.విజయ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు జల్దా లక్ష్మీ నాద్, అబ్ధుల్ ఖాదర్, కార్తీక్, రమ్మీ గౌడ్, మహిళా నాయకురాలు రాణి, ప్రవీణా, మహబూబ్ బీ, పలు సంక్షేమ సంఘాల సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS