TEJA NEWS

తాగునీటి ట్యాంకుల వద్ద లీకేజీ తో బురదమయం … ఫిర్యాదు చేసినపట్టించుకోని అధికారులు……..
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్

వనపర్తి
తాగునీటి ట్యాంక్ వద్ద లీకేజీ నీరుతో బురదమయమైన సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని జిల్లాలోని కొంకనివానిపల్లి సిపిఐ మాజీ ఉపసర్పంచ్ అంక్య మహేశ్వరి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు. గ్రామంలోని ఎనిమిదో వార్డులో ఉన్న మంచినీటి ట్యాంకుల పరిసర ప్రాంతాలన్నీ బురదమయం అయ్యాయని దీనివల్ల కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ట్యాంకు నుండి లీకేజీ అయిన నీరు ఈ వార్డులో బురదగా మారి రాత్రివేళ దుర్వాసనతో పాటు దోమల బెడదతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో ఇంత పెద్ద సమస్యను సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ పరిసర ప్రాంతాలను శుభ్రపరచి తాగునీటి లీకేజీని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ, ఏఐవైఎఫ్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాధవి, సత్యమ్మ, మన్నెమ్మ, చంద్రి, మంగమ్మ లక్ష్మమ్మ పాల్గొన్నారు.