
గంగజాతర ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ తనిఖీలు
తిరుపతి: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఉదయం భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తనిఖీ చేశారు. తిరుపతి గంగజాతర అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడం జరుగుతుందన్నారు. అలాగే బెంగళూరు, చెన్నై నగరాల్లోని స్థానికులు సైతం జాతర వేళ ఆ తల్లిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ, టీటీడీతో పాటు మున్సిపల్ శాఖకు కీలక పాత్ర ఉంటుందని వివరించ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చేయాల్సిన ఏర్పాట్ల పట్ల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ముఖ్యంగా దర్శన క్యూలైన్లు, చల్లటి తాగునీరు, ఎండకు అవసరమైన చలువ పందిళ్ళు తదితర అంశాలపై పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీల్లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డిఈలు, తదితరులు పాల్గొన్నారు.
